ఆ వృద్ధురాలు ఇంటి కరెంటు బిల్లు చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!

Woman Got Current Bill Rs.149034 For Month. తన ఇంట్లో ఏసీలు లేవు, ఫ్రిజ్ లేదు. ఇల్లు కూడా కేవలం ఒక సామాన్యులు

By Medi Samrat  Published on  16 Dec 2020 12:08 PM GMT
ఆ వృద్ధురాలు ఇంటి కరెంటు బిల్లు చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!

తన ఇంట్లో ఏసీలు లేవు, ఫ్రిజ్ లేదు. ఇల్లు కూడా కేవలం ఒక సామాన్యులు నివసించే కుటుంబం మాత్రమే. కానీ కరెంటు బిల్లు మాత్రం ఓకే సారి లక్షల్లో రావడం చూసి ఆ వృద్ధురాలు నోట మాట రాలేదు. ఇలా కరెంటు బిల్లులు కొంతమందికి వేలల్లో, లక్షల్లో రావడం మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా ప్రస్తుతం కనేకల్లు లో నివాసముంటున్న కురుబ కామాక్షమ్మకు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది.

కనేకల్లులోని మోడల్ స్కూల్ పక్కనే నివాసముంటున్న కురబ కామాక్షమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు వంటి విద్యుత్ వినియోగించే వస్తువులు లేవు. కామాక్షమ్మ ప్రతిరోజు కూలి పనులకు వెళ్తేగానే కుటుంబం గడవని పరిస్థితిలో ఉన్న ఆమె ప్రతి నెల కరెంట్ బిల్లు కేవలం వంద రూపాయలు మాత్రమే చెల్లించేది. కానీ ఈ నెల మాత్రం కరెంట్ బిల్లు ఏకంగా రూ.1,49,034 రావడంతో ఆమె షాక్ కి గురైంది.

కూలి పనులకు వెళ్లి నెట్టుకొస్తున్న తనకు ఒకేసారి ఇంత మొత్తంలో కరెంటు బిల్లు రావడం చూసి, ఇంత మొత్తం కరెంటు బిల్లు ఎప్పుడు చెల్లించాలో దిక్కు తెలియక అయోమయ పరిస్థితిలో ఉంది. అయితే తనకు న్యాయం చేయవలసిందిగా విద్యుత్ శాఖ అధికారులను కోరి వారికి పరిస్థితిని తెలియజేసింది. దీనిపై ఏఈఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇలాంటి పొరపాటు జరిగి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఈ సమస్యను సరిచేసి, వినియోగించిన యూనిట్ల మేరకు కరెంటు బిల్లులు వసూలు చేస్తామని ఏఈఈ శ్రీనివాసరెడ్డి ఆ వృద్ధురాలు తెలియజేశారు. అంతేకాకుండా ఇలాంటి సాంకేతిక సమస్యలు మరి ఎక్కడ చోటు చేసుకోకుండా తగినన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులకు తెలియజేశారు.


Next Story
Share it