ఏపీ సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

Woman attempted suicide at AP CM camp office. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.

By Medi Samrat  Published on  2 Nov 2022 8:30 PM IST
ఏపీ సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడకు చెందిన అరుద్ర అనే మహిళ చేతిపై బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వీల్‌చైర్‌లో కదల్లేని స్థితిలో ఉన్న కుమార్తెను తల్లి ఆరుద్ర సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకునివచ్చింది. అక్కడ నిర్వహించే స్పందనలో సీఎంవో అధికారులను కలిసి.. ఈ పనికి పాల్పడింది. అచేతనంగా పడి ఉన్న మహిళను గమనించిన సీఎంవో పోలీసులు హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలు మాట్లాడుతూ తన కూతురు దివ్యాంగురాలి చికిత్స కోసం తమ భూమిని అమ్ముకోనియకుండా ఏపీ మంత్రి దాడిశెట్టి రాజ గన్‌మెన్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఈ విషయమై గతంలో కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సీఎం కార్యాలయం వరకు వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.


Next Story