గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద నిర్వాహకులు బోర్డులు ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా జనవరి 26న డ్రై డేగా పరిగణిస్తారు. తిరిగి జనవరి 27న షాపులు తెరుచుకోనున్నాయి. కాగా ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోనుంది.
అటు రేపు పలు రాష్ట్రాల్లో జంతువధశాలలు, చికెన్, చేపల దుకాణాలు, హోటళ్లలో మాంసాహార విక్రయాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన (1950 జనవరి 26) ఈ రోజున, గవర్నర్లు, ముఖ్యమంత్రులు రాష్ట్ర రాజధానులలో జాతీయ జెండాను ఆవిష్కరించి, సైనిక కవాతు, శకటాల ప్రదర్శనలను తిలకిస్తారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ గీతాలాలపనతో దేశభక్తిని చాటుకుంటారు.