ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరే..రంజాన్ తోఫా సంగతేంటి చంద్రబాబు?: షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

By -  Knakam Karthik
Published on : 12 March 2026 1:30 PM IST

Andrapradesh, YS Sharmila, CM Chandrababu, Ramzan Tohfa, AP Politics, AP Government

ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరే..రంజాన్ తోఫా సంగతేంటి చంద్రబాబు?: షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఇఫ్తార్ విందులు నిర్వహించడం సరే కానీ, పేద ముస్లింలకు ఇచ్చే 'రంజాన్ తోఫా' ఏమైందని ఆమె ప్రశ్నించారు. అధికారం చేపట్టిన వెంటనే తోఫా ఇస్తామని, ముస్లింలకు భరోసా కల్పిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నారని మండిపడ్డారు. రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో రంజాన్ తోఫా కోసం కేవలం రూ. 65 కోట్లు కేటాయించడం ప్రభుత్వానికి భారమా అని నిలదీశారు.

గతంలో తోఫా ఇవ్వనందుకే ముస్లింలు జగన్‌కు బుద్ధి చెప్పారని, ఇప్పుడు చంద్రబాబుకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం గురించి చెప్పేదంతా బూటకమని, చంద్రబాబు ప్రధాని మోదీకి భయపడుతూ బీజేపీకి లొంగిపోయారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి అలవాటు పడి మైనారిటీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story