సీఎం జ‌గ‌న్‌తో వాట్సాప్ డైరెక్ట‌ర్ భేటీ

Whatsapp Delegation meets AP CM YS Jagan. ఏపీ సీఎం జ‌గ‌న్‌తో వాట్సాప్ డైరెక్ట‌ర్ భేటీ అయ్యారు. తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఈ సమావేశం జరిగింది.

By Medi Samrat  Published on  10 Sep 2022 11:50 AM GMT
సీఎం జ‌గ‌న్‌తో వాట్సాప్ డైరెక్ట‌ర్ భేటీ

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో వాట్సాప్ డైరెక్ట‌ర్ భేటీ అయ్యారు. తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఈ సమావేశం జరిగింది. సీఎంతో వాట్సాప్ ప‌బ్లిక్ పాల‌సీ డైరెక్ట‌ర్‌, సివిక్ ఎంగేజ్‌మెంట్స్ ప్రాంతీయ అధికారుల భేటీ జరిగింది. వాట్సాప్‌ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ శివనాథ్‌ థుక్రాల్‌, సివిక్‌ ఎంగేజ్‌మెంట్స్‌ ప్రాంతీయ అధికారి నిఖిల్‌ ఆప్టేలు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. శుక్రవారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారిద్దరూ సీఎం జగన్‌ను కలిశారు. ఈ భేటీలో ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌, ఎండీగా కొనసాగుతున్న చిన్న వాసుదేవరెడ్డి కూడా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్)పై రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ ఇచ్చిన హామీల్లో సీపీఎస్ రద్దు అనేది కూడా ఒకటని.. ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స తెలిపారు. ఈ అంశాన్ని రెండు నెలల్లో తేల్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఈ ఏడాది చివరి నాటికి పరిష్కరిస్తామని వివరించారు.



Next Story