ఏపీలో ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటి.?

ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

By Medi Samrat
Published on : 8 Aug 2025 2:15 PM IST

ఏపీలో ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటి.?

ఈ-కోర్టుల అమలుకు తీసుకున్న చర్యలేంటని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్ సభలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

‎దేశంలోని న్యాయస్థానాలన్నింటిలో సాంకేతిక సౌకర్యాలు కల్పించి "ఈ-కోర్టులు"గా మార్చే ప్రక్రియలో భాగంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీతో సమన్వయం చేసుకుంటూ "ఈ-కోర్టులు" ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ తెలియజేశారు.

‎‎దేశవ్యాప్తంగా ఈ-కోర్టుల ద్వారా ఇప్పటివరకు రూ: 18.57 లక్షల కేసులు విచారణ జరిగాయని, NSTEP సాంకేతిక వ్యవస్థ ద్వారా సమన్ల జారీని సులభతరం చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 188 న్యాయస్థానాలకు 10 నుంచి 100 MBPS తో కూడిన WAN కనెక్టివిటీ ఇచ్చామని చెప్పారు. ఈ-కోర్టు ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేజ్ 1, 2 లో హైకోర్టుతో పాటు 598 ఉప కోర్టులు ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురాగా మరో 51 కోర్టులలో కూడా సాంకేతిక సౌకర్యాలు కల్పించే పని జరుగుతోందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 649 కోర్టులు ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 48 కోర్టులు ఈ ప్రాజెక్టు కింద అనుసంధానించబడ్డాయని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 3,831 మంది న్యాయాధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు, 8.4 కోట్ల కోర్టు రికార్డులు డిజిటల్ చేయబడినట్లు కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ వెల్లడించారు. ఈ-కోర్టు ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ: 75 కోట్లకు పైగా ఖర్చు చేయగా, మరో రూ: 15.8 కోట్ల నిధులను విడుదల చేశామని మంత్రి తెలిపారు.

Next Story