మరో 24గంటల్లో నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. రాబోయే మూడు రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
Weather Alert. ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. కేరళ సముద్ర తీరం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయఅరేబియా సముద్ర
By Medi Samrat Published on 2 Jun 2021 3:40 PM ISTఉపగ్రహ చిత్రాల ప్రకారం.. కేరళ సముద్ర తీరం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయఅరేబియా సముద్ర ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. దీంతో రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశములు ఉన్నాయి. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది.
ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈ రోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కరుస్తాయి.
ఇక జూన్ 12వ తేదీ నాటికి కర్ణాటక, ఏపీ, తెలంగాణ మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రయణిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నైరుతి రుతు పవనాల ప్రభావంతో పాటు.. అరేబియా సముద్రంలో ఈదురుగాల కారణంగా కేరళ సహా కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.