బాణసంచా పేలుళ్ల ప్రమాదంలో నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి వాటిని బాధితులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుళ్ల ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ఆమె పేర్కొన్నారు. శాసనసభలో ఏపీ అగ్నిమాపక సేవల చట్టం సవరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, సభ ఆమోదించాక ఆమె మాట్లాడారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించి చట్టంలో మార్పులు చేస్తున్నాం. ఆధునిక భవన నిర్మాణాలు, బహుళ అంతస్తులు పెరగడంతో చట్టంలో మార్పులు అనివార్యమయ్యాయి.నిబంధనలు అతిక్రమిస్తే భవన ప్రాంగణాన్ని సీజ్ చేసి చర్యలు తీసుకుంటాం అని హోంమంత్రి హెచ్చరించారు.