ఆ రోజు 2 కోట్ల మందితో చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం..అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

By Knakam Karthik
Published on : 21 May 2025 11:53 AM IST

Andrapradesh, Cm Chandrababu, Visakhapatnam, Narendra Modi, International Yoga Day

ఆ రోజు 2 కోట్ల మందితో చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం..అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర ‌‌20‌‌25 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 21వ తేదీన విశాఖపట్నం బీచ్​ఒడ్డున ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు-నాయుడు ఈరోజు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. యోగా ప్రాముఖ్యత ప్రపంచం గుర్తించేలా చేసింది ఆయనే. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని తెలిపారు. వచ్చే నెల 21న విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ఒక ప్రపంచ రికార్డు కానుంది. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక భాగం కావాలి..అని సీఎం సూచించారు.

ప్రపంచంలోనే మంచి గుర్తింపు వచ్చేలా నూతన రికార్డు సృష్టించేలా చేస్తాం. కనీసం 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇస్తాం. 2047-విజన్‌లో ఆరోగ్యం కీలకంగా చేశాం. యోగా పాజిటివ్ థింకింగ్ అలవాటు చేస్తుంది. రోజు ఒక గంట పాటు చేస్తే మనకు ఎలాంటి ఒత్తిడి ఉన్నా తగ్గిపోతుంది. ఇది పోటీ ప్రపంచం.. ప్రతి ఒక్కరూ పోటీ పడి పని చేస్తున్నారు. యోగా కోసం ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు పని చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 టూరిస్టు కేంద్రాల్లో యోగాకు ఏర్పాట్లు చేస్తున్నాం. యోగాను పూర్తిస్థాయిలో ప్రమోట్ చేయాలి. ఈ నెల రోజుల పాటు పెద్ద ఎత్తున యోగాపై ప్రచారం చేస్తాం. యోగాను స్కూల్‌ పాఠ్యాంశంలో చేరుస్తాం. యోగా దినోత్సవం నా జీవితంలో అతిపెద్ద ఈవెంట్‌గా చేయాలని భావిస్తున్నా. దీనిపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశాం. ప్రజలు,ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు,ఉద్యోగులు అందరినీ యోగా లో బాగా స్వాములను చేస్తాం..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story