బ్యాలెట్ బాక్స్ లో చీటీ వేసిన మందుబాబు.. పాపం అతడి కోరిక ఏమిటంటే..!

Voter Cast Letter In Ballot Box. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 9,589 ఎంపీటీసీ స్థానాలకు

By Medi Samrat  Published on  19 Sept 2021 5:19 PM IST
బ్యాలెట్ బాక్స్ లో చీటీ వేసిన మందుబాబు.. పాపం అతడి కోరిక ఏమిటంటే..!

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 9,589 ఎంపీటీసీ స్థానాలకు, 641 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాత్రి కల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఎస్ఈసీ నుంచి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరగనుంది. అనంతరం ఈ నెల 25న మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక చేపట్టనున్నారు. ఈ మేరకు ఎన్నికకు ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.

బ్యాలెట్ బాక్సుల్లో కొన్ని సార్లు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని చీటీలను ప్రజలు అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. తమ ఊరికి రోడ్డు కావాలనో.. స్కూల్ కట్టించాలనో ప్రచారం సాగుతూ ఉంటుంది. అనంతపురం జిల్లాలో కూడా ఓ చీటీ కనిపించింది. అయితే అందులో అతడి సమస్య చూసి అందరూ షాక్ అయ్యారు. నల్లచెరువు మండలం తలమర్లవాండ్ల పల్లిలో కౌంటింగ్ జరుగుతుండగా, ఓ బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు ఓ చీటీ కూడా కనిపించింది.. అది ఓ మందుబాబు రాసిన చీటీగా గుర్తించారు. రకరకాల మద్యం బ్రాండ్లతో విసిగిపోయామని తెలిపారు. నల్లచెరువు వైన్ షాపులో మంచి బ్రాండ్లు పెట్టాలని, కూలింగ్ ఉన్న బీర్లు అందుబాటులో ఉంచాలని ఆ వ్యక్తి విజ్ఞప్తి చేశాడు. ఇట్లు... నల్లచెరువు యూత్ మందుబాబుల అధ్యక్షుడు అని లేఖలో పేర్కొన్నాడు. ఏది ఏమైనా మందుబాబు డిమాండ్ గురించి సోషల్ మీడియాలో మంచి ప్రచారం సాగుతూ ఉంది.


Next Story