ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి రండి.. సీఎం జ‌గ‌న్‌కు ఆహ్వానం

Vontimitta Ramaiah Kalyanam. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన‌ నిర్వహించే

By Medi Samrat
Published on : 27 March 2023 7:02 PM IST

ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి రండి.. సీఎం జ‌గ‌న్‌కు ఆహ్వానం
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన‌ నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనాల‌ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం వీరు సీఎంను కలిశారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు.


Next Story