వ్యాపారాల‌ను విశాఖ నుంచి హైదరాబాద్‌కు త‌ర‌లించ‌నున్న వైసీపీ ఎంపీ..?

Vizag YSRC MP to shift business to Hyderabad. వైసీపీ నేత‌, విశాఖప‌ట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన వ్యాపారాల‌ను హైదరాబాద్‌కు మార్చాలని

By Medi Samrat  Published on  20 Jun 2023 3:32 PM GMT
వ్యాపారాల‌ను విశాఖ నుంచి హైదరాబాద్‌కు త‌ర‌లించ‌నున్న వైసీపీ ఎంపీ..?

వైసీపీ నేత‌, విశాఖప‌ట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన వ్యాపారాల‌ను హైదరాబాద్‌కు మార్చాలని నిర్ణయించుకున్నార‌నే వార్త క‌ల‌క‌లం రేపుతుంది. ఇటీవ‌ల విశాఖ న‌గ‌రానికి చెందిన ఓ రౌడీ షీట‌ర్‌, త‌న ముఠా.. ఎంపీ ఎంవీవీ కుమారుడు శరత్ చంద్ర, భార్య జ్యోతి, ఆయ‌న‌ ఆడిటర్ జీవీ ని కిడ్నాప్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్‌లో విశాఖ‌ నుంచే పాల‌నా కార్యకలాపాలు సాగిస్తానని కూడా ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీకి చెందిన‌ ఎంపీ నగరం విడిచి హైదరాబాద్‌లో స్థిరపడనున్నార‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏకకాలంలో రాజకీయాలు, వ్యాపారాలు కొనసాగించడం కష్టంగా మారిందని , తాను రాజకీయ నాయకుడైన కారణంగా తనపై వ్యాఖ్యలు చేసినప్పుడల్లా బాధపడ్డానని ఎంపీ ప‌లువురు వ‌ద్ద వాపోయిన‌ట్లు తెలిసింది.


Next Story