డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల నుండి తెలుగు తల్లి ఫ్లై ఓవర్, బీఆర్‌టీఎస్ సహా ఇతర రోడ్లు క్లోజ్ చేస్తున్నామని వైజాగ్ సీపీ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. నూతన సంవత్సర వేడుకలపై బుధవారం ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ గా బయటకి వచ్చి సెలెబ్రెషన్ లు చెయ్యడం, కేకులు కొయ్యడం లాంటివి నిషేధం అని తెలిపారు. 31 డిసెంబర్ అర్ధరాత్రి బైకులపై తిరుగుతూ హడావుడి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెస్టారెంట్ లు, వైన్ షాపులు వాటి టైమింగ్ ప్రకారం ఓపెన్ గా ఉంటాయని.. ఎక్కడా డీజేలు పెట్టకూడదని ఆదేశించారు. చేస్తే మీ ఇంట్లో న్యూ ఇయర్ చేసుకోండి.. లేదా పోలీస్ స్టేషన్ లో మాతో కలిసి న్యూ ఇయర్ చేసుకోండని సీపీ మనీష్ కుమార్ సిన్హా అన్నారు.