పుస్తకాలు, పెన్నులు ఎరచూపి బాలికలపై అఘాయిత్యానికి పాల్ప‌డుతున్న వ్య‌క్తికి దేహ‌శుద్ధి చేసిన మ‌హిళలు

Vishakapatnam Crime News. విశాఖప‌ట్నం జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దోమానా

By Medi Samrat  Published on  6 Dec 2021 6:23 PM IST
పుస్తకాలు, పెన్నులు ఎరచూపి బాలికలపై అఘాయిత్యానికి పాల్ప‌డుతున్న వ్య‌క్తికి దేహ‌శుద్ధి చేసిన మ‌హిళలు

విశాఖప‌ట్నం జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ దోమానా చిన్నారావుకు మహిళలు దేహశుద్ధి చేశారు. పుస్తకాలు, పెన్నులు ఎరచూపి అభం శుభం తెలియని మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ట్యూషన్ కి వెళ్లిన బాలికలు.. ఉపాధ్యాయులకు విష‌యం తెలపడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విష‌యాన్ని ఉపాధ్యాయులు బాలికల తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళారు. రౌడీ షీటర్ దోమనా చిన్నారావు స్థానికంగా రాజకీయ నాయకుల‌ అండ దండలతో రెచ్చిపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ముసుగులో బాలికలపై అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. చదువుకునేందుకు సామగ్రి ఇస్తానంటూ.. ఇంటికి తీసుకువెళ్లి వర్ణించలేని రీతిలో బాలికలతో ప్రవర్తించిన చిన్నారావు తీరుపై స్థానిక మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ దేహ‌శుద్ధి చేశారు. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Next Story