విజయవాడ To విశాఖపట్నం.. ఎయిర్ ఇండియా విమానం రద్దు

విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారు.

By -  Medi Samrat
Published on : 19 Dec 2025 7:47 PM IST

విజయవాడ To విశాఖపట్నం.. ఎయిర్ ఇండియా విమానం రద్దు

విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని చివరి నిమిషంలో రద్దు చేశారు. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానం బయలుదేరడానికి ముందు నిర్వహించే తనిఖీల్లో పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, విమానాన్ని తిరిగి ర్యాంప్‌ వద్దకు తీసుకువచ్చారు.ముందుజాగ్రత్త చర్యగా విమాన సర్వీసును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

విమానం రద్దు కావడంతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రయాణికులందరికీ హోటల్‌లో వసతి, భోజన సదుపాయాలు కల్పించామని, టికెట్ డబ్బులు ఫుల్ రిఫండ్ చేయడం లేదా మరో విమానంలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించడం వంటి ఆప్షన్లు అందించినట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

Next Story