పీఏసీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

Vijaysai Reddy Elected AS PAC Member. కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైసీపీకి చెందిన విజయసాయి రెడ్

By Medi Samrat
Published on : 10 Aug 2021 2:22 PM IST

పీఏసీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్య సభ సెక్రటరీ జనరల్‌ దేష్‌ దీపక్‌ వర్మ బులెటెన్‌ ద్వారా అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేందర్ యాదవ్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు నామినేషన్లు ఆహ్వానించగా విజయసాయి రెడ్డితోపాటు బీజేపీకి చెందిన డాక్టర్‌ సుధాంశు త్రివేది నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో వీరిద్దరూ పీఏసీకి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు.





Next Story