చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్ల వర్షం

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇటీవల ఐటీ నోటీసులు రావడంపై

By Medi Samrat  Published on  2 Sep 2023 3:00 PM GMT
చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్ల వర్షం

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇటీవల ఐటీ నోటీసులు రావడంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. షెల్ కంపెనీల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు ముట్టిన రూ.118 కోట్లు సముద్రంలో నీటి బొట్టులాంటివని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. అమరావతి అనేది పెద్ద స్కామ్ అన్నారు. ఇందులో భాగస్వామిగా ఉన్న సింగపూర్ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడు ఈశ్వరన్ అరెస్టయ్యాడన్నారు. సీఆర్డీఏ ప్లానింగ్‌లో అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోళ్లు, ఇంకా లక్ష కోట్ల వ్యవహారాలు బయటకు రావాల్సి ఉందన్నారు.

చంద్రబాబు పొత్తు కోసం ఢిల్లీ వెళితే పాత ఐటీ కేసు మీడియా ద్వారా వెలుగు చూసిందని, తవ్వితీయాలే కాని ఇలాంటివి పదివేల అక్రమాలు బయటపడతాయని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఢిల్లీలో చక్రం తిప్పి చంద్రబాబు చేసిన పనులు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని, కేవలం తన సంపద పెంచుకోవడం కోసమే అని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా అందుకోసమే ఆయన శ్రమించారని అన్నారు. అమరావతి కాంట్రాక్టులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో కమీషన్‌గా తీసుకున్న 118 కోట్ల లెక్క చూపని ధనం గురించి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మీరు కటిక పేదవారు కనుకే కుప్పంలో రెండు గదుల చిన్న ఇల్లు కట్టుకుంటున్నారు కదా అని అన్నారు. విజనరీ అంటే దోచుకోవడంలో ఆరితేరడమా? అని ప్రశ్నించారు.

Next Story