విజయవాడలో నడిరోడ్డుపై జుట్టు జుట్టు పట్టుకుని, పిడిగుద్దులు గుద్దుకుంటూ..

Vijayawada College Girls fight each other video goes viral. విజయవాడలో ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై జుట్లుపట్టుకుని కొట్టుకున్నారు.

By Medi Samrat  Published on  23 April 2022 9:15 PM IST
విజయవాడలో నడిరోడ్డుపై జుట్టు జుట్టు పట్టుకుని, పిడిగుద్దులు గుద్దుకుంటూ..

విజయవాడలో ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై జుట్లుపట్టుకుని కొట్టుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. విజయవాడ వన్ టైన్ లోని కేబీఎన్ కాలేజీ గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పక్కనున్న స్నేహితులు, ఇతర విద్యార్థినులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా, తగ్గేదేలా అన్నట్లు కొట్లాడుకున్నారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడున్న వారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్‌గా మారింది.

పక్కన ఉన్న విద్యార్థులు వారిని ఆపేందుకు ఎంత ప్రయత్నించినా.. ఆ ఇద్దరు విద్యార్థినిలు వెనక్కు తగ్గలేదు. ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ నానా హంగామా సృష్టించారు. వారిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటన్న సంగతి స్పష్టత లేదు కానీ.. తోటి విద్యార్థులు మాత్రం ప్రేమ వ్యవహారమే ఘర్షణకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. అందరూ చూస్తుండగానే విద్యార్థినిలు అలా దాడి చేసుకోవడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Next Story