విజయసాయి రాజీనామా.. సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే!
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పందించారు.
By Knakam Karthik Published on 25 Jan 2025 3:40 PM ISTవిజయసాయి రాజీనామా.. సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే!
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు స్పందించారు. విజయసాయి రాజీనామా వైసీపీ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారు, లేదంటే ఎవరి మార్గం వాళ్లు చూసుకుంటారని పేర్కొన్నారు. అటు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖను ఆమోదించారని విజయసాయి చెప్పారు.
ఇదిలావుంటే.. రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు అందించిన అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన ఎంపీ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు అందించానని, రాజీనామాను ఆమోదించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. లండన్‌లో ఉన్న వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి చెప్పానని విజయసాయిరెడ్డి వివరించారు. అయితే, రాజీనామా చేయొద్దని, తాను, పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. రాజీనామా అంశం సరికాదని, దీనిపై పునరాలోచించాలని జగన్ సూచించారని అన్నారు.
వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నానని విజయసాయిరెడ్ మరోసారి స్పష్టం చేశారు. లండన్‌లో ఉన్న జగన్‌తో అన్ని అంశాలు మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశానని చెప్పారు. తాను రాజీనామా చేయడం కూటమికే లబ్ధి చేకూరుతుందని అన్నారు. వైసీపీలో తన ప్రాతినిధ్యాన్ని ఎవరూ తక్కువ చేయలేరని విజయసాయిరెడ్డి తెలిపారు. తనలాంటి వాళ్లు 1000 మంది పార్టీ వీడినా జగన్‌కి, పార్టీకి నష్టం లేదని చెప్పారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, భవిష్యత్‌లో తాను రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు.