కర్ణాటక గవర్నర్‌తో విజయసాయిరెడ్డి భేటీ

Vijayasai Reddy meets Karnataka governor. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మంగళవారం బెంగళూరులోని రాజ్‌భవన్‌లో

By Medi Samrat
Published on : 19 April 2022 5:30 PM IST

కర్ణాటక గవర్నర్‌తో విజయసాయిరెడ్డి భేటీ

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మంగళవారం బెంగళూరులోని రాజ్‌భవన్‌లో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన విశేషాలను ఎంపీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. రాజ్యసభలో ప్రస్తుత కర్ణాటక గవర్నర్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న విజయసాయిరెడ్డి, థావర్‌చంద్ గెహ్లాట్‌తో బలమైన బంధాన్ని కలిగి ఉండడం గొప్ప అనుభవం అని అభిప్రాయపడ్డారు. పలు అంశాలపై చర్చించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

"ఈరోజు బెంగళూరులోని రాజ్‌భవన్‌లో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ జీని కలవడం నాకు గౌరవంగా ఉంది. రాజ్యసభలో బలమైన బంధం ఉన్న రోజులను గుర్తుచేసుకోవడం గొప్ప అనుభవం. ఆయనతో అనేక ఇతర విషయాల గురించి చర్చించాను" అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో రాశారు.










Next Story