వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను విచారణకు హాజరు కావాలంటూ విజయసాయికి ఏపీ సిట్ నోటీసులు పంపింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలన్నారు. అయితే ఒక రోజు ముందుగానే విచారణకు విజయసాయి హాజరుకాబోతున్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు విజయసాయి సమాచారం అందించారు. 17న విచారణకు హాజరవుతానని సమాచారం పంపారు. 18న తనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉందని, అందువల్ల ఒకరోజు ముందుగానే విచారణకు వస్తానని తెలిపారు. సిట్ అధికారులు అందుకు ఓకే చెప్పారు.