ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థులలో నైపుణ్యం పెంపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రైవేటు పాఠశాలల స్టూడెంట్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తయారుచేస్తున్నారు. జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు కావాల్సినవన్నీ సీఎం జగన్ అందజేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యింది. ఇదే విషయమై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు.
జగనన్న విద్యా కానుక పథకం కింద 23.59 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లీష్ నైపుణ్యం పెంచడం కోసం ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది రాష్ట్ర ప్రభుత్వం. 4 డిక్షనరీలను బాబు, లోకేశం, అచ్చెన్న, ఉమలకు కూడా అందజేయాలని విద్యాశాఖ అధికారులకు నా విన్నపమని విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. ఏపీలో ప్రతి చిన్న విషయానికి పాలక, ప్రతి పక్షాల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరుగుతుంది. విజయసాయి తాజా ట్వీట్ పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.