తిరుమల : పరకామణిలో చోరికి పాల్పతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు

Vigilance officials arrested a person who was involved in theft in Parakamani. తిరుమలలోని నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు, సీసీ కెమరాల నిఘా ఏర్పాటు

By Medi Samrat
Published on : 30 April 2023 3:22 PM IST

తిరుమల : పరకామణిలో చోరికి పాల్పతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు

తిరుమలలోని నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు, సీసీ కెమరాల నిఘా ఏర్పాటు చేయడంతో అక్రమాలకు పాల్పడే వారిని విజిలెన్స్ అధికారులు ఇట్టే గుర్తిస్తున్నారు. ఆదివారం నోట్ల లెక్కింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మలమార్గం వద్ద ఉంచుకుని బయటకు వెళుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో నోట్లను గుర్తించి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చెయ్యడం.. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా వుంచడంతో ప్రతి ఒక్కరి కదలికపై సూక్ష్మ స్థాయిలో నిఘా ఉంచుతున్నారు.

గతంలోను ఇలాంటి ఘటనలు జరిగినా వెంటనే గుర్తించే వెసులుబాటు ఉండేది కాదు. నూతన పరకామణి మండపంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భధ్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో స్వామి సేవ కోసం వచ్చి, చోరీకి పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించగలుగుతున్నారు. భవిష్యత్త్ లో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కోనసాగుతుందని భధ్రతాధికారులు స్పష్టం చేశారు.


Next Story