టాలీవుడ్ నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యల వివాదంపై ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ స్పందించారు. హిందూ దేవతలు, భారతీయ మహిళల వస్త్రధారణపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. అతడి వ్యాఖ్యలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు విశాఖపట్నంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. దేవతలను కించపరిచేలా మాట్లాడిన అన్వేష్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ నేతలు డిమాండ్ చేశారు.