ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ పనిచేసే తీరు ఇదేనా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్ర‌శ్నించారు. మాదక ద్రవ్యాల మాఫియాను ప్రశ్నించడానికి టీడీపీ బృందం వెళ్తే దాడులకు తెగబడతారా? అంటూ నిల‌దీశారు. బోటులో ఏముందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా? అని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. మాఫియా మూకలు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు చోద్యం చూస్తారా? అని ఫైర్ అయ్యారు. చోద్యం చూసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మాదకద్రవ్యాలతో యువతను నిర్వీర్యం చేస్తుంటే.. చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. గత నెల 15వ తేదీ ముంద్రాలో 21వేల కోట్ల హెరాయిన్ పట్టుబడితే.. 16న కాకినాడలో బోటు ఎందుకు దగ్ధమైంది? అని అన్నారు. తెలుగుజాతి నిర్వీర్యమయ్యే ప్రమాదం దృష్ట్యా కేంద్రం జోక్యం చేసుకోవాలని.. జాతీయ దర్యాప్తు సంస్థతో ప్రధాని విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో ఘటనలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని వర్ల రామయ్య అన్నారు.


సామ్రాట్

Next Story