ఎన్టీఆర్‌కు వైఎస్సార్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: వంగలపూడి అనిత

Vangalapudi Anitha Fire On YSRCP. టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీపై మరోసారి ఫైర్ అయ్యారు.

By Medi Samrat  Published on  25 Sept 2022 4:30 PM IST
ఎన్టీఆర్‌కు వైఎస్సార్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: వంగలపూడి అనిత

టీడీపీ ఏపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీపై మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై ఏపీలో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు వైఎస్సార్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. డాక్టర్‌గా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సేవలందించిందుకే ఎన్టీఆర్‌ వర్సిటీకీ పేరుపెట్టామని చెప్పుకుం టున్న వైసీపీ నేతలు జగన్‌ ఉన్న జైలుకు కూడా పేరుపెట్టాలని అన్నారు. పదహారు నెలల పాటు వైఎస్‌ జగన్‌ ఉన్న జైలుకు జగన్‌ సెంట్రల్‌ జైలు లేదా వైఎస్సార్‌ సెంట్రల్‌ జైలు అని పేరు పెట్టుకోవాలని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డికి తండ్రి మీద ప్రేమ ఉంటే తల్లి, చెల్లిని పక్క రాష్ట్రానికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు.

తండ్రి వైఎస్సార్‌ మీద ప్రేమ ఉంటే తాడేపల్లి ఫ్యాలస్, హైదరాబాదులో ఉన్న లోటస్‌ పాండ్‌కు ఎందుకు వైఎస్ పేరు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో వైఎస్ భారతి, విజయసాయి రెడ్డి అల్లుడు ఉన్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ విషయాన్ని కప్పి పుచ్చడానికి, పేర్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఎన్టీఆర్‌పై అపార గౌరవముందని అంటున్న జగన్‌ అసెంబ్లీలో ఎన్టీఆర్‌ కూతురిపై వ్యాఖ్యలు చేస్తే ఎందుకు నవ్వుతూ ఉండిపోయారని నిలదీశారు.


Next Story