పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు

Vallabaneni Vamshi Comments On NTR And Pawan Kalyan. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీగా తాను బరిలోకి దిగబోతున్నానంటూ

By Medi Samrat  Published on  17 Oct 2022 12:30 PM GMT
పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీగా తాను బరిలోకి దిగబోతున్నానంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారమని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ కూడా ఎలాంటి మాట మాట్లాడలేదని అన్నారు. తాను గన్నవరం నుంచే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ పాతికేళ్ల వయసులో టీడీపీ కోసం ప్రచారం చేశారని.. ఆ సమయంలో ఆయనకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందని... భగవంతుని దయవల్ల ఆయన కోలుకున్నారని వంశీ తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఎన్టీఆర్ వచ్చారని.. తారక్ ను కనీసం స్టేజ్ పైకి కూడా ఆహ్వానించలేదని విమర్శించారు. అమరావతితో ఎన్టీఆర్ కు సంబంధం లేదని. అమరావతి రైతులకు మద్దతుగా రావడం లేదని ఆయనను విమర్శించడం సరికాదన్నారు. ఆయన సినిమాలేవో ఆయన చేసుకుంటున్నారని వంశీ చెప్పారు.

పవన్ కళ్యాణ్ తన క్యాడర్‌ను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రులపై దాడి చేయడం చాలా పొరపాటు అని.. తన క్యాడర్‌కు పవన్ కళ్యాణ్ చాలా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని అన్నారు. 6 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఇలా దాడి చేస్తే 50 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న వైసీపీ దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు.


Next Story