ప్రేమించిన వ్యక్తిని కలవడానికి ఏపీలోని మారుమూల గ్రామానికి చేరుకున్న అమెరికా యువ‌తి

అమెరికాకు చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ప్రేమించిన వ్యక్తిని కలవడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామానికి చేరుకుంది.

By Medi Samrat
Published on : 8 April 2025 9:15 PM IST

ప్రేమించిన వ్యక్తిని కలవడానికి ఏపీలోని మారుమూల గ్రామానికి చేరుకున్న అమెరికా యువ‌తి

అమెరికాకు చెందిన ఒక ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ప్రేమించిన వ్యక్తిని కలవడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామానికి చేరుకుంది. ఆమె వారి మొదటి పరిచయాన్ని ఓ వీడియోలో రికార్డు చేసి ఆన్‌లైన్‌లో షేర్ చేసింది.

ఫోటోగ్రాఫర్ జాక్లిన్ ఫోరెరో చందన్‌తో ప్రేమలో పడింది. DMలతో ప్రారంభమైన ప్రేమ, రోజువారీ వీడియో కాల్స్‌గా మారింది. 14 నెలల సుదూర డేటింగ్ తర్వాత, జాక్లిన్ చివరకు అతన్ని వ్యక్తిగతంగా కలవడానికి భారతదేశానికి చేరుకుంది.

అమెరికాలో ఫోటో గ్రాఫర్ ప్లస్ ఇన్ ఫ్లూయన్సర్ అయిన జాకిన్ ఫోరెరో తన ఇన్ స్టాలో తన ప్రేమ ప్రయాణం గురించి వివరించారు. చందన్ అనే వ్యక్తిని ఫోరెరో ప్రేమించింది. ఆమె కంటే చందన్ తొమ్మిదేళ్లు చిన్న. అయినప్పటికీ వారి మనసులు కలిశాయి. ఈ జంట ఒక యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తున్నారు. ఎలా కలిసారో లాంటి ఎన్నో వివరాలను పంచుకున్నారు.

Next Story