కుంభమేళాకు రండి.. సీఎం చంద్రబాబుకు యూపీ ముఖ్య‌మంత్రి ఆహ్వానం

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని తీర్థరాజ్ ప్రయాగరాజ్‌లో జరిగే మహాకుంభ మేళాకు రావాలని సీఎం చంద్రబాబును యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వానించారు.

By Medi Samrat  Published on  7 Dec 2024 8:30 PM IST
కుంభమేళాకు రండి.. సీఎం చంద్రబాబుకు యూపీ ముఖ్య‌మంత్రి ఆహ్వానం

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని తీర్థరాజ్ ప్రయాగరాజ్‌లో జరిగే మహాకుంభ మేళాకు రావాలని సీఎం చంద్రబాబును యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబుకు యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వాన లేఖను పంపారు. యూపీ డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే సాంస్కృతిక బృందాలతో పాటు ఆయా సంస్థల ప్రతినిధులకు యూపీ ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గంగాజలం ఇచ్చారు. సిఎం వారిని సత్కరించారు.

Next Story