ఢిల్లీ: అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్ లో ఈ సమావేశాల్లో కానీ వచ్చే సమావేశాల్లో గానీ బిల్లు పెడతాం..అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 2014 నుంచి రాజధానిగా గుర్తించాలా..లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి బిల్లును మానిటర్ చేస్తున్నారు. అమరావతి బిల్లు పై జగన్ విషం కక్కుతున్నారు. జగన్ ను శాశ్వత రాజకీయ సమాధి చేయాలి. జగన్ కి పని చేత కాలేదు. 34 వేల మంది రైతులు ఇచ్చిన భూములు వినియోగించుకోలేక ఏపీ భవిష్యత్ ను నాశనం చేసారు. ప్రణాళికా బద్దంగా అమరావతి అభివృద్ధి చేస్తున్నాం. అమరావతి బిల్లు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. వేల మంది అమరావతి నిర్మాణం పనిచేస్తున్నారు..అని పెమ్మసాని వ్యాఖ్యానించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 16 జాతీయ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు, హడ్కో ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. CAG, పోస్టల్ బిల్డింగ్,కేంద్రీయ విద్యాలయాలు అమరావతిలో ఏర్పాటు అవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు,జాతీయ రహదారుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి..అని కేంద్రమంత్రి పెమ్మసాని పేర్కొన్నారు.