ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని నివాసంలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణె శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ శాఖకు సంబంధించిన ప్రాజెక్ట్‌లపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం అన్నారు. అనంతరం గిరిధర్‌ను సన్మానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమ అందజేశారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం గిరిధర్.. మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్ పరిశీలనకు వెళ్ళారు. అక్కడ జరిగిన ఎన్‌సీసీ పునిత్ సాగర్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిధర్ అరమణె ఏపీ క్యాడర్‌కు చెందని ఐఏఎస్ అధికారి కావడం విశేషం.