అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది

By Medi Samrat  Published on  24 Oct 2024 10:41 AM GMT
అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని అమరావతికి, మరొకటి ఉత్తర బీహార్‌ను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే మరో ప్రాజెక్ట్ కు కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. కృష్ణానదిపై 3.2 కిమీ మేర రైల్వే వంతెన నిర్మాణానికి కూడా కేంద్రం పచ్చజెండా ఊపింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. రూ. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం జరగనుంది. రాజధాని అమరావతికి హైదరాబాద్‌, చైన్నె, కోల్‌కోత్తాకు అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం చేయనున్నారు.

మరో ప్రాజెక్ట్ ఉత్తర బీహార్, ఈశాన్య రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ 256 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. 4,553 కోట్ల అంచనా వ్యయంతో, ఈ డబుల్ లైన్ రైలు మార్గంలో 40 వంతెనలు ఉండనున్నాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే కాకుండా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాను సులభతరం చేస్తాయి. అదే సమయంలో పవిత్ర నగరమైన అయోధ్యను సీతామర్హితో కలుపుతుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ రెండు ప్రాజెక్టులకు దాదాపు రూ.6,798 కోట్ల అంచనా వ్యయంతో పచ్చజెండా ఊపింది.

Next Story