కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ఊహించని గుడ్ న్యూస్
కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయారు.
By Medi Samrat Published on 29 March 2024 9:00 PM ISTకర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కు కర్నూలు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తూ ఇటీవల వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. హఫీజ్ ఖాన్ కు సీఎం జగన్ ఊహించని ఆఫర్ ఇచ్చారు. హఫీజ్ ఖాన్ ను రాజ్యసభకు పంపిస్తున్నట్టు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో ప్రకటించారు. వైసీపీ తరపున హఫీజ్ ఖాన్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తారని అన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో హఫీజ్ ఖాన్ కు టికెట్ కేటాయించలేకపోయాం. రెండేళ్ల తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ రాజ్యసభకు పోటీ చేస్తారని సీఎం జగన్ తెలిపారు.
ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మే 13న జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రం.. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అని అన్నారు. పేదలంతా ఒక వైపు, పెత్తందార్లు మరో వైపు ఉన్నారన్నారు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని సీఎం జగన్ ప్రజలకు సూచించారు. పాదయాత్రలో తాను చూసిన ప్రజల సమస్యలను గత 58 నెలల పాలనలో పరిష్కరించేందుకు ప్రయత్నించానని వెల్లడించారు. విద్యారంగంలో జరిగిన మార్పులకు గర్వపడుతున్నానన్నారు సీఎం జగన్.