కర్నూలులో డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం

ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డ్రోన్ ద్వారా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

By Medi Samrat
Published on : 25 July 2025 2:15 PM IST

కర్నూలులో డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం

ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) డ్రోన్ ద్వారా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. కర్నూలులో ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం తెలిపారు. "భారతదేశ రక్షణ సామర్థ్యాలకు ఒక పెద్ద ప్రోత్సాహకంగా, @DRDO_India ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR) పరీక్షా శ్రేణిలో UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM)-V3 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది" అని సింగ్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని యూఎల్‌పీజీఎం-వీ3 గా వ్యవహరిస్తున్నారు. ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలో డీఆర్‌డీవోకు చెందిన ఎన్ఓఏఆర్ పరీక్ష కేంద్రంలో ఈ పరీక్ష నిర్వహించారు. దాదాపు 2,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో డీఆర్‌డీవో అధీనంలో ఉన్న అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ రేంజ్ ను 2016-17లో ప్రారంభించారు. ఈ క్షిపణిని తయారుచేసిన డీఆర్డీవోతో పాటు ఇందుకు సాయం చేసిన ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్ లను కేంద్ర మంత్రి అభినందించారు.

Next Story