నిద్రిస్తుండ‌గా గోడ కూలి ఇద్దరు దుర్మ‌ర‌ణం

Two killed in Andhra wall collapse. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శనివారం ఇంటి గోడ కూలి ఇద్దరు మృతి చెందగా

By Medi Samrat
Published on : 9 July 2022 1:47 PM IST

నిద్రిస్తుండ‌గా గోడ కూలి ఇద్దరు దుర్మ‌ర‌ణం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శనివారం ఇంటి గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కుమరం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను అడ్డాల లక్ష్మి (47), అడ్డాల అశోక్ కుమార్ రాజు (5)గా గుర్తించారు. స్థానికులు శిథిలాల కింద నుంచి మృతదేహాలను బయటకు తీశారు.

గాయపడిన ముగ్గురిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలావుంటే.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.










Next Story