Tirumala: తొక్కిసలాట క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ దర్శనం.. వీడియో

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడిన వారికి టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది.

By Knakam Karthik  Published on  10 Jan 2025 11:13 AM IST
ANDRAPRADESH,TTD,TIRUMALA, CM CHANDRABABU, STAMPEDE VICTIMS

Tirumala: తొక్కిసలాట క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ దర్శనం

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడిన వారికి టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది. సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతో అధికారులు తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేక దర్శనం చేయించారు. తొక్కిసలాటలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎంతో మాట్లాడిన బాధితులు, తమకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని కోరడంతో వెంటనే సీఎం చంద్రబాబు అంగీకరించారు. అనంతరం వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే గాయపడిన 52 మంది భక్తులకు టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది.

కాగా ఈ నెల 8వ తేదీన రాత్రి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు జారీ చేస్తున్న సమయంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు తమ ప్రాణాలు కోల్పోయారు.మృతులను లావణ్య, శాంతి, నాయుడు బాబు రజనీ, మల్లికగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అటు తీవ్రంగా గాయపడిన వారికి కూడా 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాల్లోని ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.

Next Story