కోనసీమ జిల్లాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో తన ఇద్దరు పిల్లలకు బాదంపాలులో పురుగుల మందు కలిపి తాగించి చంపేశాడు ఓ తండ్రి. పావులూరి కామరాజు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు కామరాజు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనను ముగ్గురు వ్యక్తులు దారుణంగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వ్యక్తుల వల్లే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదేళ్ల క్రితం కామరాజు భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోగా, ఇప్పుడు కామరాజు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు.