గత కొన్ని రోజులుగా కూరగాయల పంటలకు రెక్కలొచ్చాయి. ఎన్నడూ పలకన్నంతా ధరలు పలుకుతున్నాయి. దీంతో ఎన్నో సార్లు కూరగాయల పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతన్నలకు ఈ సారి మాత్రం సిరుల వర్షం కురుస్తోంది. రేట్ల పెరుగుదలతో టమాటా సాగు రైతులు మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. మార్కెట్‌లో టమోటాకు మంచి ధర పలుకుతుండడంతో.. రైతులు రోజువారీ రూ.10 వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురవడండో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు పూర్తిగా నీట మునగడంతో మార్కెట్లలోకి కూరగాయల లోడులు తక్కువగా వస్తున్నాయి.
దీంతో మార్కెట్లలో కూరగాలయ ధరలు ఆకాశన్నంటాయి. మార్కెట్‌లో టమాటాలు కిలోకి రూ.60కి పైగా పలుకుతోంది. మంచి ధర ఉండడంతో టమాటా రైతుల్లో ఆనందం కనబడుతోంది. ఇప్పుడే తమకు అసలైన ధర లభిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంతో రైతులు తిరిగి టామాటా సాగును మళ్లీ ప్రారంభిస్తున్నారు. ఇక మదనపల్లి మార్కెట్‌లో 30 కిలోల టమాటా రూ.600 ధర పలుకుతోంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో.. త్వరలో కోతకు వచ్చే కూరగాయల పంటల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కూరగాయాల సాగుకు విత్తనాలు, డ్రిప్, సామాగ్రిని సబ్సిడీపై ఇస్తే బాగుంటుందని రైతులు చెబుతున్నారు.