నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే ఛాన్స్
నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ.. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
By - అంజి |
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే ఛాన్స్
అమరావతి: నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ.. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. వివిధ శాఖలకు చెందిన పలు ప్రతిపాదనలపై కేబినెట్ మీటింగ్‌లో చర్చించనున్నారు. టెక్ హబ్ ల్యాండ్ ఇన్సెంటివ్ పాలసీకి అదనపు నిబంధనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌లో అమిడ్యాల లిఫ్ట్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
ప్రకాశం బ్యారేజ్–దివిసీమ ప్రాంతాల్లో వరద నష్టం మరమ్మతులకు అనుమతితో పాటు, మైలవరం డ్యాం గేట్ల బలోపేత పనులకు, తిరుమల- తిరుపతి తాగునీటి సరఫరా కోసం 126 కోట్ల ప్రాజెక్ట్ పనులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అనంతపురం ఉరవకొండ–వజ్రకరూరు కు కొత్త లిఫ్ట్ స్కీమ్‌కు, మిడ్ పెన్నా ప్రాజెక్ట్‌లో గేట్ల రీప్లేస్‌మెంట్, బ్యూటిఫికేషన్ పనులకు పర్మిషన్ ఇవ్వనున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15 వేల రూపాయల వార్షిక ఆర్థిక సహాయం ర్యాటిఫికేషన్, ఏపీ టూరిజం పాలసీలో కారవాన్ టూరిజం, హోమ్‌స్టే ప్రోత్సాహకాలు చేర్పు, AMRUT 2.0 కింద 10,319 కోట్లతో 281 ప్రాజెక్టులకు రివైజ్డ్ ఆమోదానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
అమరావతి ప్రాజెక్టుల కోసం ప్రత్యేక SPV ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే కేబినెట్ సమావేశంలో రాజధాని ప్రాజెక్ట్ భూమి సేకరణకు న్యాయ పరిరక్షణ మినహాయింపులు, గుంటూరు లామ్ రీజినల్ పౌల్ట్రీ ఫార్మ్ భూములపై వివాద పరిష్కారం, ఎండోమెంట్స్ చట్టం 19వ సెక్షన్‌లో "కుష్టురోగం" పదం తొలగింపు బిల్లు, ఏపీ–సర్వే ఆఫ్ ఇండియా మధ్య MoU కు అనుమతి, ఎప్ట్రాన్స్‌కో ఆదేశాల్లో మార్పుల ప్రతిపాదనపై చర్చ జరగనుంది. గ్రీన్ హైడ్రజన్ ప్రోత్సాహకానికి సలహా కమిటీ ఏర్పాటు, కాకినాడలో 1 MMTPA గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టంలో సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలపనుంది.