స్వగ్రామానికి లాన్స్‌ నాయక్‌ సాయితేజ పార్థివదేహం.. ఇవాళ అంత్యక్రియలు

Today is Lance Nayak Saiteja's funeral. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైనికుడు లాన్స్‌ నాయక్‌ సాయితేజ మృతి చెందారు. సాయితేజ పార్థివదేహాం ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడకు తరలించారు.

By అంజి  Published on  12 Dec 2021 10:58 AM IST
స్వగ్రామానికి లాన్స్‌ నాయక్‌ సాయితేజ పార్థివదేహం.. ఇవాళ అంత్యక్రియలు

తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్ బిపిన్‌ రావత్‌తో సహా 13 మంది చనిపోయిన విషయం తెలిసింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైనికుడు లాన్స్‌ నాయక్‌ సాయితేజ మృతి చెందారు. సాయితేజ పార్థివదేహాం ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడకు తరలించారు. బెంగళూరులోని ఆర్మీకి చెందిన కమాండ్‌ నుండి సాయితేజ పార్థవదేహాన్ని చిత్తూరు సరిహద్దు చీకలబైలు, వలసపల్లి మీదుగా రోడ్డు మార్గంలో సుమారు 30 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీగా ఎగువరేగడకు తీసుకెళ్తున్నారు. సాయితేజ భౌతికకాయాన్ని తీసుకెళ్తున్న ర్యాలీలో బంధువులు, స్నేహితులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎగువరేగడకు సాయితేజ పార్థివదేహాం చేరుకున్న తర్వాత సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు.

నిన్న సాయితేజ పార్థవదేహాన్ని ప్రత్యేక విమానంలో బెంగళూరులోని ఎలహంక ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు పంపించారు. హెలికాప్టర్‌ దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఇప్పటికే రావత్‌ దంపతులిద్దరికి అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం నాడు సాయితేజ సహా ఆరుగురుని గుర్తించిన అధికారులు.. వారి భౌతిక కాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో వైపు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వరుణ్‌ సింగ్‌ పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉంది. శనివారం నాడు బిపిన్‌ రావత్‌, మధూలిక రావత్‌ల అస్థికలను, చితాభస్మాన్ని వారి కుమార్తెలు హరిద్వార్‌లోని గంగానదిలో కలిపారు.

Next Story