నేడు దావోస్‌కు సీఎం చంద్రబాబు..బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో పెట్టుబడులే టార్గెట్
ఏపీకి పెట్టుబడులు లక్ష్యంగా ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 19 Jan 2025 7:26 AM ISTనేడు దావోస్‌కు సీఎం చంద్రబాబు..బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో పెట్టుబడులే టార్గెట్
ఏపీకి పెట్టుబడులు లక్ష్యంగా ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నేడు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో పాటు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించడమే టార్గెట్‌గా, దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్తున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు హాజరయ్యే ఈ సదస్సులో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు సీఎం. రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించడం ద్వారా అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ఉండనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ టూర్ షెడ్యూల్..
ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ముందుగా ఢిల్లీ చేరుకుంటారు సీఎం చంద్రబాబు. అక్కడి నుంచి బయల్దేరి తన టీమ్‌తో జ్యూరిచ్‌కు చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్‌లో ఉన్న ఇండియన్ అంబాసిడర్‌తో సమావేశమవుతారు. అనంతరం హిల్టన్ హోటల్‌లో పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. అనంతరం అక్కడ నుంచి హోటల్ హయట్‌కు వెళ్లి తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీటింగ్‌లో పాల్గొంటారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తోన్న ఈ మీటింగ్‌లో రాష్ట్రంలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు. అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకుంటారు.
తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సహా ఆయన టీమ్ పాల్గొంటారు. అనంతరం అర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో జరిగే ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. తొలి రోజు సమావేశాలు ముగించుకుని హోటల్‌కు చేరుకుంటారు. రెండో రోజు సీఐఐ సెషన్‌లో గ్రీన్ హైడ్రోజన్ టాపిక్‌పై జరిగే డిస్కషన్‌లో పాల్గొంటారు. తరువాత సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్‌స్పన్, ఎల్‌జీ, కార్ల్స్ బర్గ్, సిస్కో, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలు, ఛైర్మన్‌లతో రెండో రోజు భేటీ అవుతారు. మూడో రోజూ పలు వ్యాపార దిగ్గజాలతో సీఎం చంద్రబాబు సమావేశంకానున్నారు. నాలుగో రోజు ఉదయం దావోస్ నుంచి జ్యూరిచ్‌కు చేరుకుని, అక్కడి నుంచి స్వదేశానికి చేరుకుంటారు.