తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఆ తర్వాత డీఎస్పీ సరిగా స్పందించలేదని, ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. అంబులెన్స్‌ను డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్లినట్టు, ఘటన జరిగిన తర్వాత 20 నిమిషాల వరకు అతను అందుబాటులోకి రాలేదని చెప్పారు. అటు తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ 40 మందిని డిశ్చార్జ్ చేశామని అధికారులు తెలిపారు. 48 మందికి అస్వస్థతకు గురయ్యారని, వారికి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స అందించామని చెప్పారు.
వారిలో 40 మందిని డిశ్చార్జ్ చేయగా, 8 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇవాళ సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు. బాధిత కుటుంబాలకు ఇవాళ సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటిస్తారని టీటీడీ చైర్మ్ బీఆర్ నాయుడు తెలిపారు. ఘటనపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. టోకెన్ కేంద్రం వద్ద ఉన్న డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులందరూ తోసుకురావడం వల్లే ఘటన జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు పేర్కొన్ఆనరు. వైకుంఠ ద్వార దర్శనం 19వ తేదీ వరకు ఉంటుందని వెల్లడించారు.