శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆర్జిత సేవా టికెట్లు నేడే విడుదల

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన ఆర్జిత సేవా టికెట్ల డిసెంబరు కోటా నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.

By -  Knakam Karthik
Published on : 18 Sept 2025 6:45 AM IST

Andrapradesh, Tirumala, Tirupati, TTD, Srivari Arjitha Seva tickets

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన ఆర్జిత సేవా టికెట్ల డిసెంబరు కోటా నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. అంగప్రదక్షిణ టోకెన్లను ఈ నెల నుంచి ఆన్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా జారీ చేయనున్నారు. 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు నగదు చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు 22న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం మూడింటికి అందుబాటులో ఉంచనున్నారు. 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం మూడింటికి అద్దె గదుల బుకింగ్ కోటా ఉంటుంది.

Next Story