ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సీఎం జగన్.. ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ని కలిసి చర్చించారు.
ఇదిలావుంటే.. రేపు మధ్యాహ్నం ఏపీ మంత్రుల రాజీనామాలు గవర్నర్ వద్దకు చేరనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2గంటల తర్వాత కొత్త మంత్రుల జాబితాను సీఎంవో అధికారులు తీసుకెళ్లనున్నారు. ఎల్లుండి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11.31గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది.
ఇదిలావుంటే.. కేబినెట్ మార్పు ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయం కాదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులను మారుస్తానని సీఎం జగన్ ముందే చెప్పారన్నారు. కేబినెట్ అవినీతిమయమైందని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. 2019లోనే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. 80 శాతం మార్పులుంటాయని గతంలోనే చెప్పారన్నారు. ఆశావహులు ఎక్కువ మందే ఉన్నారన్నారు.