వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ చెంత చేరారు. వీరు గతంలోనే వైసీపీకి రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎమ్మెల్సీలు కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరారు. ముగ్గురు ఎమ్మెల్సీలకు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించారు.
ఉండవల్లి నివాసంలో శుక్రవారం సీఎం చంద్రబాబు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే టీడీపీలో చేరామని ఎమ్మెల్సీలు తెలిపారు.