జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరించారు. ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఉప అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు పంపారు. బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేశారు అధికారులు.