భారీ శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల తేదీ ఇదే

అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా రెడీ అయ్యింది.

By అంజి
Published on : 29 July 2025 7:08 AM IST

funds, Annadatha Sukhibhav scheme, APnews, Farmers, PM Kisan

భారీ శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల తేదీ ఇదే

అమరావతి: అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా రెడీ అయ్యింది. మొత్తం 46.65 లక్షల మంది రైతులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆగస్టు 2న పీఎం కిసాన్‌ 20వ విడత వాయిదా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కానుంది. వారణాసిలో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ రైతులకు రూ.2 వేల చొప్పున పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.831.60 కోట్లు అందనున్నాయి.

ఇక అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించనుంది. మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే రూ.2 వేలకు మరో రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకానికి ఎంపికైన 46.64 లక్షల రైతు కుటుంబాల్లో.. ఇంకా 40,346 మంది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. కాగా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలను రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.6 వేలు కాగా.. రాష్ట్రం వాటా రూ.14 వేలు.

Next Story