వైసీపీ హయాంలో చంద్రబాబుపై మహాకుట్ర జరిగింది: కోటంరెడ్డి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ చీఫ్‌, సీఎం చంద్రబాబు నాయుడిపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆరోపించారు.

By అంజి
Published on : 19 Nov 2024 1:30 PM IST

conspiracy, Chandrababu, YCP regime, TDP MLA Kotamreddy Sridhar Reddy, APnews

వైసీపీ హయాంలో చంద్రబాబుపై మహాకుట్ర జరిగింది: కోటంరెడ్డి

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ చీఫ్‌, సీఎం చంద్రబాబు నాయుడిపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. ఓ టీవీ ఛానల్‌లో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ దీనిపై చాలా క్లారిటీ చెప్పారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో పొరపాటు జరిగిందని తాను ఎప్పుడూ చెప్పలేదని ఆయన తెలిపారని కోటంరెడ్డి సభలో తెలిపారు.

''కుట్ర విషయాన్ని రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పీవీ రమేష్‌ తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, సీఐడీ, సీఎంవోలో ఒకే సమయంలో ఫైళ్లు మాయమయ్యాయి. సీఎంవోలోని పెద్దల జోక్యంతోనే ఇది సాధ్యం. తన స్టేట్‌మెంట్‌తో చంద్రబాబును అరెస్ట్‌ చేసినట్టు అవాస్తవాలు చెప్పారని పీవీ రమేష్‌ తెలిపారు. దీనిపై ఇన్వేస్టిగేషన్‌ చేయాలని గతంలో ఆయన డీజీపీకి లెటర్‌ రాశారు. దీనికి డీజీపీ స్పందించారా? లేదా అనేది తేల్చాలి. ఈ అంశంపై సభలో చర్చించాలి. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి'' అని ఆయన పేర్కొన్నారు.

Next Story