కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అవాక్కయ్యే సంఘ‌ట‌న జ‌రిగింది. ఆసుప‌త్రి సిబ్బంది బాధ్యతా రాహిత్యం మ‌రోమారు బ‌ట్ట‌బ‌య‌లైంది. ఏకంగా అంత్య‌క్రియ‌లు అయిన మ‌నిషి తిరిగి రావ‌డంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. వివ‌రాళ్లోకెళితే.. జగ్గయ్యపేటలోని స్థానిక క్రిష్టియన్ పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ కరోనాతో గత నెల 12న విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.

అయితే.. 15వ తేదిన గిరిజమ్మ చనిపోయినట్లు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించింది. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. నేడు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గిరిజమ్మ డిశ్చార్జ్ అయి జగ్గయ్యపేటకు తిరిగొచ్చింది. కాగా, గిరిజమ్మ కుటుంబ స‌భ్యులు అంత్య‌క్రియ‌లు జ‌రిపిన మృత‌దేహం ఎవ‌రిద‌న్న విష‌య‌మై క్లారిటీ రావాల్సి ఉంది.
సామ్రాట్

Next Story