చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై జరగని విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించలేదు

By Medi Samrat  Published on  17 Jan 2024 11:16 AM GMT
చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై జరగని విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించలేదు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం వాద‌న‌లు వినాల్సివుండ‌గా.. ఈ రోజు విచారించ‌డంలేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ వెల్లడించారు. విచారణ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది 14వ నెంబర్ కోర్టులో విచారణలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఫైబర్ నెట్ కేసులో విచారణను చేపట్టలేదు. చంద్రబాబు తరపున కేసును వాద‌న‌లు వినిపించేందుకు సుప్రీంకోర్టుకు న్యాయ‌వాది సిద్ధార్థ్ లూథ్రా వెళ్లారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులోని అంశాలు 17ఏతో ముడిపడి ఉన్నందున గతంలో ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. జడ్జిలు అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భిన్న తీర్పులు వెలువరించినందున ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫెర్ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసు సీజేఐ ముందుకు చేరింది. 17-ఏ వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు.

Next Story